- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Syria Crisis: సిరియా సంక్షోభం.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
సిరియాలో(Syria Crisis) రాజకీయ అనిశ్చితి నెలకొంది. తిరుగుబాటుదారుల చర్యలతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని వీడారు.

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో(Syria Crisis) రాజకీయ అనిశ్చితి నెలకొంది. తిరుగుబాటుదారుల చర్యలతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని వీడారు. కాగా.. సిరియా సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ(MEA) స్పందించింది. సిరియాలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షించింది. ‘‘సిరియా (Syria in Rebels Power)లోని ప్రస్తుత పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్నాం. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సిరియా ప్రజల అవసరాలకు అనుగుణంగా శాంతిస్థాపన జరిగేలా సమ్మిళిత రాజకీయ ప్రక్రియ ఉండాలని సూచిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ దేశంలో ఉన్న భారతీయుల భద్రత కోసం డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీ (Indian Embassy in Syria) నిరంతరం పనిచేస్తోందని పేర్కొంది.
సిరియా సంక్షోభం
సిరియా సంక్షోభంవేళ అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే వారంతా సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. డమాస్కస్‌లోని మన రాయబార కార్యాలయాన్ని అన్నివేళలా తెరిచే ఉంచినట్లు పేర్కొన్నాయి. రెబల్స్ ఆక్రమణతో అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై రెబల్స్ తో చర్చలు జరిపాకే అసద్ సిరియా వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది.






