పాకిస్థాన్‌కు 3 వేల మంది ఇండియ‌న్స్..ఏప్రిల్‌లోనే ముహుర్తం !

by velandi.Saikiran |   (  Updated:2026-03-30 22:00:41  IST  )

ఏప్రిల్ మాసంలో దాదాపు 3,000 మంది భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ వెళ్ళబోతున్నారు.

పాకిస్థాన్‌కు 3 వేల మంది ఇండియ‌న్స్..ఏప్రిల్‌లోనే ముహుర్తం !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన భారత బార్డర్ లోకి అక్రమంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే వాటిని ఇండియన్ ఆర్మీ కూడా చాలా దాటిగానే ఎదుర్కొంది. అయితే ఇలాంటి క్రమంలో 3,000 మంది భార‌తీయులు... పాకిస్తాన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ మాసంలో దాదాపు 3,000 మంది భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ వెళ్ళబోతున్నారు.

10 రోజులు పాకిస్తాన్ లోనే

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఏప్రిల్ 10వ తేదీన బైశాఖి ఉత్సవం ప్రారంభం అవుతాయి. ఈ ఉత్సవాలు దాదాపు 15 రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉత్సవాలలో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా ఇండియాకు సంబంధించిన సిక్కు యాత్రికులు పాల్గొంటారు. దీంతో పాటు ఎమినాబాద్, ఫరూఖాబాద్, నాన్ కనా సాహెబ్ లాహోర్, కర్తాపూర్ లాంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ అధికారులు కూడా అధికారిక ప్రకటన చేశారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ ఏటా వీరి కోసం ప్రత్యేక జథా వీసాలు అందజేస్తోంది. కాగా ఏప్రిల్ 13వ తేదీన ఇండియా నుంచి బయలుదేరనున్న ఈ యాత్రికులు, ఏప్రిల్ 22వ తేదీ వరకు అంటే దాదాపు పది రోజుల పాటు పాకిస్తాన్ లోనే ఉంటారు.

Next Story