- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NDA@12.. జూన్ 10న కీలక సమావేశం
జూన్ 10వ తేదీన ఢిల్లీలో ఎన్డీయే పక్షాలు కీలకంగా భేటీ కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లుగా పాలన అందిస్తోంది. ఈ సందర్భంగా.. కూటమి నేతలంతా దేశరాజధాని అయిన ఢిల్లీలో కీలకంగా సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఈ కీలక సమావేశానికి.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్డీయే అధినేతలు సన్మానించనున్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా, పదవిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. 1952 నుండి 1964 వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించిందని ఈ సమావేశ నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని గౌరవిస్తూ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిని ఇతర ముఖ్య ఎన్డీయే (NDA) నాయకులు బలపరుస్తారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొన్న తీరును, అలాగే దేశ ఆర్థిక పురోగతిని ఈ తీర్మానం ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. దీంతో పాటు.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నాయకులు చర్చించనున్నారు.






