ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబ‌రాలు

by velandi.Saikiran |   (  Updated:2025-07-10 09:36:52  IST  )

ఫ్లోరిడా లోని టాంపాలో ఎనిమిదవ నాట్స్ ( NATS) తెలుగు సంబరాలు చాలా గ్రాండ్ గా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన

ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబ‌రాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్లోరిడా లోని టాంపాలో ఎనిమిదవ నాట్స్ ( NATS) తెలుగు సంబరాలు చాలా గ్రాండ్ గా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలలో తెలుగు సెలబ్రిటీలు, వేలాది మంది తరలివచ్చారు. ఈ ఈవెంట్ కు తెలుగు వారు.. అధిక సంఖ్యలో రావడం గమనార్హం. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఇతర మెంబర్లు ఈ తెలుగు సంబరాలు విజయవంతం కావడానికి చాలా కృషి చేశారు.

అంతేకాదు ఈ సంబరాలలో టాలీవుడ్ హీరోలు నందమూరి బాలయ్య , హీరోయిన్ శ్రీ లీల, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, సంగీత దర్శకుడు తమన్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందరూ పాల్గొన్నారు. ఇక నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికులలా పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు నాట్స్ కమిటీ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్. ఈ వేడుకలకు వచ్చిన అతిధులు , కమ్యూనిటీ, కళాకారులకు సహకరించిన వాలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలు కూడా తెలిపారు.

ఇక ఈ ఈవెంట్ కు దాదాపు 20,000 మందికి పైగా హాజరు అయినట్లు తెలుస్తోంది.నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్ చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు. సంబ‌రాలే కాక సామాజిక బాధ్యతగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి నాట్స్‌ 85 లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణకు నాట్స్‌ అందించింది. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

Next Story