- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nato: రష్యాతో వ్యాపారం చేస్తే100 శాతం సుంకాలు.. భారత్‌కు నాటో వార్నింగ్
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని నాటో వార్నింగ్ ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని నాటో (Nato) వార్నింగ్ ఇచ్చింది. భారత్ (India) , చైనా (China), బ్రెజిల్ (Brazil) వంటి దేశాలు రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే తీవ్రమైన ద్వితీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో చీఫ్ మార్క్ రుట్టే తెలిపారు. అమెరికా సెనెటర్లతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చలకు ఒప్పుకునేలా ఈ మూడు దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేదంటే ఆయా దేశాలకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. అంతేగాక రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని తెలిపారు. 50 రోజుల్లోగా శాంతి ఒప్పందం కుదరకపోతే భారీ సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే రుట్టే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి అధికంగా చమురును కొనుగోలు చేస్తోంది. ద్వితీయ ఆంక్షలు విధిస్తే అది భారతదేశంపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. భారత్ తన మొత్తం చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగాన్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. ఆంక్షల కారణంగా రష్యన్ చమురు సరఫరా ఆగిపోవచ్చు. అయితే దీని వలన భారత్ ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురును కొనుగోలు చేయాల్సి ఉండంతో చమురు ధరలు పెరిగే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు.






