పంజాబ్ బాలుడి సాహసానికి జాతీయ గుర్తింపు

by Ajay Maddhiboyina |

పంజాబ్ బాలుడి సాహ‌సానికి జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కింది. ప‌హ‌ల్గామ్ ఎటాక్ తో భార‌త్ పాకిస్థాన్ పై యుద్ధం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

పంజాబ్ బాలుడి సాహసానికి జాతీయ గుర్తింపు
X

దిశ‌, వెబ్ డెస్క్: పంజాబ్ బాలుడి సాహ‌సానికి జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కింది. ప‌హ‌ల్గామ్ ఎటాక్ తో భార‌త్ పాకిస్థాన్ పై యుద్ధం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శత్రుదేశంతో భారత్ విరోచితంగా పోరాడింది. ఆ దేశంపై మిస్సైల్స్ వర్షం కురిపించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ సైతం భారత్ పై దాడులకు తెగబడింది. అయితే యుద్ధం సమయంలో పెద్దవారే బయటకు రావడానికి వణికిపోతుంటారు.

ఎక్కడ తమపై దాడి జరుగుతుందో ఏ బాంబు వచ్చి పైన పడుతుంతో అని బయపడిపోతుంటారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం యుద్ధం చేస్తున్న సైనికుల వద్దకు వెళ్లి మరీ వారికి పాలు, మంచి నీళ్లు అందించాడు. పంజాబ్ కు చెందిన 10ఏళ్ల శ్రవణ్ ఈ పని చేయగా అతడికి తాజాగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు దక్కింది. అంతే కాకుండా శ్రవణ్ చదువులకు సంబంధించిన పూర్తి ఖర్చులను భారత ఆర్మీనే భరించనుంది.

Next Story