రేపే నాసా అర్టెమిస్-1 ప్రయోగం..

by Disha Web Desk 6 |
రేపే నాసా అర్టెమిస్-1 ప్రయోగం..
X

వాషింగ్టన్: నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అర్టెమిస్ ప్రయోగానికి సమయం దగ్గరపడింది. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11.34 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. కేప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించనుంది. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్‌ను నాసా ప్రారంభించింది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగం రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీని ద్వారా నాసా చంద్రుడిపైకి మనుషులను పంపాలని భావిస్తోంది. మొదటి ప్రయోగంలో మానవ రహితంగానే సాగుతున్నప్పటికీ భవిష్యతులో మనుషులను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2024లో అర్టెమిస్-2 ప్రయోగం చేపట్టాలని నాసా భావిస్తుండగా, చంద్రుడిపై శాశ్వత నివాసాలకు ప్రయత్నిస్తోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత నాసా మళ్లీ చంద్రుడిపైకి ప్రయోగాలు చేయడం గమనార్హం.

Next Story