నేడు ప్రధాని మోదీతో లోకేష్ భేటీ..వీటిపైనే చర్చ

by Ajay Maddhiboyina |

నేడు ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి అందజేయనున్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించనున్నారు.

నేడు ప్రధాని మోదీతో లోకేష్ భేటీ..వీటిపైనే చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి అందజేయనున్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

మోడీతో సమావేశం తరవాత లోకేష్ తిరిగి విజయవాడకు చేరుకుని గురుపూజోత్సవంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రాజ‌ధాని నిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ త‌ర‌చూ నాయ‌కులు ప్ర‌ధాని, కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం అవుతున్నారు.

Next Story