- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్‌స్టీన్ ‘వైల్డ్ డిన్నర్’లో మస్క్, జుకర్‌బర్గ్.. మరో సంచలన ఫోటో బయటకు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ (The Epstein Files) కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి, అమెరికా న్యాయశాఖ డిప్యూటీ అటార్నీ జనరల్ టడ్ బ్లాంచ్ (Todd Blanch) తాజాగా 30 లక్షల పేజీలను విడుదల చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ (The Epstein Files) కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి, అమెరికా న్యాయశాఖ డిప్యూటీ అటార్నీ జనరల్ టడ్ బ్లాంచ్ (Todd Blanch) తాజాగా 30 లక్షల పేజీలను విడుదల చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వెల్లడైన ఈ ఫైల్స్‌లో టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) కలిసి ఉన్న ఒక ఫోటో బయటపడింది. 2015లో కాలిఫోర్నియాలో జరిగిన ఒక విలాసవంతమైన డిన్నర్ పార్టీలో మస్క్, జుకర్‌బర్గ్ ఒకే టేబుల్ వద్ద కూర్చుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆ పార్టీని ఒక ఈ-మెయిల్‌లో ‘వైల్డ్’ అని అభివర్ణించాడు. అదేవిధంగా ఇదే పార్టీలో లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ కూడా ఉన్నట్లు తెలిసింది.
అయితే, ఎలోన్ మస్క్ గతంలో తనకు ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదని, అతడి పార్టీలకు ఏనాడూ వెళ్లలేదని ప్రకటించారు. కానీ, ఈ తాజా ఫోటో, ఈ-మెయిల్ ఆధారాలు మస్క్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి.






