Muruga maanadu: ‘మురుగన్ భక్తర్గళ్ మానాడు’కు భారీగా ప్రజలు.. ఆరు తీర్మానాలు ఆమోదం

by B.Srinivas |

తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ‘మురుగ భక్తర్గళ్ మానాడు’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Muruga maanadu: ‘మురుగన్ భక్తర్గళ్ మానాడు’కు భారీగా ప్రజలు.. ఆరు తీర్మానాలు ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ‘మురుగ భక్తర్గళ్ మానాడు’ కార్యక్రమం ఘనంగా జరిగింది. హిందూ సంస్థలు, బీజేపీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా రాజకీయ నాయకులతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. మురుగన్ సమావేశంలో పాల్గన్న ప్రతినిధులు ఆరు తీర్మానాలు ఆమోదించారు. మురుగన్ కొండలను రక్షించాల్సిన అవసరంతో పాటు పలు ప్రతిపాదనలకు ఆంగీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత అన్నామలై (Annamalai) మాట్లాడుతూ.. హిందువులను ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో అధికారంలో ఉన్నవారే నిర్ణయించుకోవాలన్నారు. ‘హిందువులు తమ జీవన విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు హిందువులపైనే అవమానకరమైన భాషలో మాట్లాడతారు. ఇది సరైన పద్దతి కాదు. హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు’ అని అన్నారు. ప్రపంచ జనాభాలో 0.2 శాతం మాత్రమే ఉన్న యూదులు తమ హక్కుల కోసం నాలుగు దేశాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. కానీ భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, దానిని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ సమావేశం నిర్వహణకు వ్యతిరేకంగా సృష్టించబడిన అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ లక్షలాది మంది ప్రజలు తరలిరావడంతో ఇది గొప్ప విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఉమ్మడి సంస్కృతి మారకుండా చూసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్ఎస్ఎస్ నేత వన్నియరాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Next Story