Munir: అమెరికా పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండో సారి

by B.Srinivas |

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఈ వారం మరోసారి అమెరికాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.

Munir: అమెరికా పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండో సారి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ (Asim munir) మునీర్ ఈ వారం మరోసారి అమెరికాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైఖేల్ ఇ కురిల్లా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్టు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం మునీర్ అమెరికాకు వెళ్లడం ఇది రెండో సారి. అంతకుముందు ఆయన జూన్ 14న అమెరికాలో పర్యటించి యూఎస్ ఆర్మీ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు ట్రంప్‌తోనూ సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మరోసారి అమెరికా వెళ్లనుండటం గమనార్హం. అయితే ట్రంప్ భారత్ పై సుంకాలు విధించిన వేళ మునీర్ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు జనరల్ కురిల్లా పాకిస్తాన్ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉన్నాడు. పలు మార్లు పాక్‌పై ప్రశంసలు కురిపించారు. భారతదేశం, పాకిస్తాన్ రెండింటితోనూ అమెరికా మంచి సంబంధాలను కలిగి ఉండాలని పలు మార్లు వ్యాఖ్యానించారు.

Next Story