48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత

by Dishanational1 |
48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర కాంగ్రెస్‌కు పార్టీ సీనియర్ నేత షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి బాబా సిద్ధిక్ పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న తాను తక్షణమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. 'తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరాను. సుధీర్ఘ కాలం(48 ఏళ్లు) పార్టీకి సేవ చేశాను. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ, కొన్ని చెప్పకపోవడమే మంచిదనిపిస్తోంది. దశాబ్దాలుగా తనకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నేతలు, సహచరులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు' ఎక్స్‌లో ట్వీట్ చేశారు. విద్యార్థి నాయకుడైన బాబా సిద్ధిక్ తన రాజకీయ జీవితాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కి కార్పొరేటర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత 1999, 2004,2009లో బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో ఉన్నారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై్‌కి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇటీవల ఆయన కుమారుడితో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను కలిసిన నేపథ్యంలో త్వరలో సిద్ధిక్ ఎన్సీపీలో చేరతారని అంతా భావించారు. ఈ క్రమంలోనే తాజా పరిణామాం చోటుచేసుకోవడం గమనార్హం.


Next Story

Most Viewed