- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Justice Varma: జస్టిస్ వర్మను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌కు మెమోరాండం సమర్పించిన ఎంపీలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానంపై మొత్తం 145 మంది లోక్‌సభ సభ్యులు సంతకం చేశారు

దిశ, నేషనల్ బ్యూరో: ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ పార్లమెంటు సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెమోరాండం సమర్పించారు. సోమవారం మొదలైన పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ మేరకు ఎంపీలు అభిశంసన తీర్మానం ఇచ్చారు. అందులో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానంపై మొత్తం 145 మంది లోక్‌సభ సభ్యులు సంతకం చేశారు. సంతకం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీ, ఏజీపీ, ఎస్ఎస్ (షిండే), ఎల్జేఎస్పీ, ఎస్కేపీ, సీపీఎం మొదలైనవి ఉన్నాయి. ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీపీ చౌదరి, సుప్రియా సులే, కేసీ వేణుగోపాల్, తదితరులు సంతకం చేసిన ప్రముఖులలో ఉన్నారు. ఇక, రాజ్యసభలో కూడా 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులను ఇచ్చారు. ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కె సురేష్.. ఇండియా కూటమి పార్టీలు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తాయన్నారు. అంతకుముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది అత్యంత తీవ్రమైన అంశ. ఇది అందరినీ ఆందోళనకు గురిచేసే విషయం. అందుకే జస్టిస్ వర్మ తొలగింపు వ్యవహారంలో అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయని వెల్లడించారు.






