- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mpox: కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ !
కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మంకీపాక్స్ (Monkey pox) కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన వ్యక్తి 19 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న మంగళూరుకు తిరిగి వచ్చాడు. అనంతరం ఆయన శరీరంపై దద్దుర్లు రావడంతో పాటు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరగా అనుమానం వచ్చిన డాక్టర్లు ఆతని నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే నమూనాలను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్‌గా నిర్థారించినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఈ ఏడాది దేశంలో వెలుగు చూసిన మొదటి మంకీపాక్స్ కేసు ఇదే కావడం గమనార్హం. గతేడాది ఈ వ్యాధి ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.






