- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన MP అసద్
వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill) చట్టవిరుద్ధం అంటూ ఎంఐఎం పార్టీ(MIM Party) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill) చట్టవిరుద్ధం అంటూ ఎంఐఎం పార్టీ(MIM Party) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ భూములు లాక్కునే కుట్రకు కేంద్రం పూనుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. వక్ఫ్ బిల్లు(Waqf Bill) రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్నివర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. ముస్లిం హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తోన్న ఆరోపణలను రిజిజు తోసిపుచ్చారు.






