పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జి.. 8 గంటల్లో 2 ప్రమాదాలు.. ఆందోళనలో వాహనదారులు(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-05 06:09:24  IST  )

రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జి.. 8 గంటల్లో 2 ప్రమాదాలు.. ఆందోళనలో వాహనదారులు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంతలోనే అక్కడికి దగ్గరలోని సుభాష్‌నగర్‌లో నిర్మించిన పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని నిర్మాణంలో ఇంజినీరింగ్ వైఫల్యం కారణంగా ఎనిమిది గంటల్లో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ వంతెనను రూ.40 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తోంది. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్తుంటారు. అయితే.. ఈ వంతెన నిర్మాణం వల్ల సుభాష్ నగర్‌లో రద్దీ తగ్గిందని చెబుతున్నారు. కానీ.. ఆ బ్రిడ్జి నిర్మాణం పలు చోట్ల మెలికలు తిరిగి ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రాత్రి సమయంలో అధిక వేగంతో ప్రయాణించే వాహనాదారులు మలుపుల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఓ కారు ప్రమాదానికి సంబంధించిన ఘటన వెలుగు చూసింది. కారు మలుపు తిరిగే సమయంలో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి, గాలిలో పల్టీలు కొట్టింది. దీంతో కారులోని వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని వారికి సహాయం చేశారు. పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. Video

Next Story