Ghulam Nabi Azad: ప్రపంచం మొత్తం కన్నా పాక్ లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు

by Shamantha N |

పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రతినిధి బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌ (Bahrain)లో పర్యటిస్తోంది.

Ghulam Nabi Azad: ప్రపంచం మొత్తం కన్నా పాక్ లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రతినిధి బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌ (Bahrain)లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో ఒకరైన జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారని విమర్శించారు. గులాం నబీ మాట్లాడుతూ.. “బహ్రెయిన్‌ వివిధ మతాల సమ్మేళనమని, ప్రజలు ఐక్యంగా ఉన్నారు. ఎలాంటి విభేదాలు లేవు.ని అన్నారు. ఇది ఓ మినీ ఇండియాలా కనిపిస్తోంది. అఖిల పక్ష బృందంలో ఉన్న తామంతా వేర్వేరు పార్టీలకు చెందినవారిమైనా.. ఐక్యంగా ప్రపంచ దేశాల ముందుకు వచ్చాం. కానీ, పాక్‌ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశం. అయినా కూడా అక్కడి వారిలో ఐక్యత లేదు. అయితే, తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్ ఐక్యంగా ఉండలేకపోయాయి. కానీ మన దేశంలో, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉన్నారు. మేము శాంతి, సామరస్యంతో జీవిస్తున్నాం. కానీ, పాకిస్థాన్‌లో నివసిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చు." అని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, బహ్రెయిన్ లోని ప్రవాస భారతీయులను కలవడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. మన ప్రధానులందరూ పాక్ సహా పొరుగుదేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. పాక్ నాయకత్వంతో చర్చలు జరిపారని గుర్తుచేశారు. కానీ అలాంటి ప్రతి చొరవ తర్వాత భారత్ ఉగ్రదాడులను ఎదుర్కొందని విమర్శించారు.

ఆపరేషన్ సిందూర్ పై..

పాకిస్థాన్‌తో సహా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని గులాం నబీ ఆజాద్ అన్నారు. పాక్‌ అధినేతలతో శాంతి చర్చలు జరపడానికి అనేకసార్లు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై అక్కడి నేతలకు వివరిస్తూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ కేవలం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని.. సాధరణ ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించలేదన్నారు. అయినప్పటికీ దాయాది దేశం భారత సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై దాడులకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే, పహెల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత భారత్ పై పాక్ దాడులు చేపట్టింది. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈనేపథ్యంలోనే కేంద్రం దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా భారత్‌ ఉగ్రవాదులపై జరిపిన దాడుల గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపింది.

Next Story