దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీదే అధికారం

by Malleboina Mahesh |   (  Updated:2025-08-28 16:39:27  IST  )

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది.

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీదే అధికారం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే (India Today-C Voter Mood of the Nation Survey) నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDA ఆధిపత్యాన్ని ప్రదర్శించి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే 2024లో 234 సీట్లకు మాత్రమే పరిమితం అయిన బీజేపీ 260 సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీంతో పాటుగా 2024 ఎన్నికల్లో 234 సీట్లను సాధించిన ఇండియా కూటమికి కేవలం 208 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆపరేషన్ సిందూర్ తర్వాత జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశ వ్యాప్తంగా 2.06 లక్షల మంది ప్రజల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించి ఈ అంచనా రిపోర్టు తయారు చేశారు. ఏది ఏమైనప్పటికి బీహార్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకొని ప్రచారంలోకి వెళ్తున్న ఇండియా కూటమిని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే షాక్ ఇచ్చింది.

Next Story