- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తీరం దాటనున్న మొంథా తుపాన్.. రైళ్లు, విమానాలు రద్దు!
నేడు తీరం దాటనున్న మొంథా తుపాన్. ఏపీ, ఒడిశాలో పలు మార్గాల్లో రైళ్లు, విమానాలు రద్దు చేస్తున్నట్లు రైల్వే, విమానయాన సంస్థల ప్రకటన.

దిశ, నేషనల్ బ్యూరో: మొథా తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటేందుకు దూసుకొస్తోంది. మంగళవారం నాడు ఈ తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ క్రమంలోనే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం, భీమవరం తదితర మార్గాల్లో ప్రయాణించాల్సిన 65 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. వాతావరణం మెరుగైన తర్వాత భద్రతా ప్రమాణాలు బట్టి రైలు సేవలు తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఆంధ్ర కారిడార్‌లో పలు రైలు సేవలు రద్దయ్యాయి. అలాగే విమాన సేవలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సోమవారం నాడు విశాఖపట్టణానికి వెళ్లాల్సిన అన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.
మొంథా తీరం దాటనున్న నేపథ్యంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇది తీవ్రమైన తుఫాను రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రి ఈ తుఫాను తీరం దాటుతుందని తెలిపింది. ఈ తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ, విశాఖపట్టణం జిల్లాల్లోని చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాయి. అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేయడంతోపాటు నీరు, విద్యుత్ సప్లయ్ దెబ్బతినకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తుఫాను సద్దుమణిగే వరకూ భద్రత అడ్వయిజరీని పాటించాలని సూచించింది.






