- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంకేతిక లోపంతో ఆగిపోయిన మోనోరైలు
ముంబైలోని వాడాలా ప్రాంతంలో సాంకేతిక లోపాల కారణంగా మోనోరైలు నిలిచిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మోనోరైలు (Monorail) మరోసారి ఆగిపోయింది. సోమవారం ఉదయం 7 గంటల తర్వాత స్టేషన్ నుంచి ప్రారంభం అయిన తర్వాత సగం దూరం వెళ్ళింది. అయితే సాంకేతిక లోపంతో (Technical error) ఆ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలట్ టెక్నికల్ సిబ్బంది సహాయం కోరాడు. ఈ సమాచారం అందుకున్న MMRDA టెక్నికల్ సిబ్బంది హుటాహుటిన ట్రైన్ నిలిచిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం 30 నిమిషాల పాటు శ్రమించి మోనోరైలు ఉన్న 17 మంది ప్రయాణికులను బయటకు పంపించారు.
ఈ ఘటనపై టెక్నికల్ ఇంచార్జ్ మాట్లాడుతూ.. "ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో, ముకుంద్‌రావ్ అంబేద్కర్ రోడ్ జంక్షన్ వద్ద మోనోరైలు లో సాంకేతిక లోపం ఏర్పడింది. మోనోరైలు గాడ్గే మహారాజ్ స్టేషన్ నుండి చెంబూర్‌కు వెళుతోంది. మోనోరైలు సాంకేతిక బృందం ముంబై అగ్నిమాపక దళాలలకు ఫోన్ చేసింది. మా ప్రత్యేక వాహనాన్ని సంఘటనా స్థలానికి తరలించారు. మోనోరైలు సాంకేతిక బృందం తో అక్కడకు చేరుకుని రైల్లో ఉన్న 17 మందిని సురక్షితంగా తరలించారు. రైలును కప్లింగ్ ద్వారా వాడాలాకు తరలిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. అందరూ సురక్షితంగా ఉన్నారని... ఆపరేషన్ ముగిసిందని ఆయన చెప్పుకొచ్చారు.






