మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ రేంజ్‌కు!

by Jakkula.Mamatha |

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన మోనాలిసా గురించి తెలిసిందే.

మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ రేంజ్‌కు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన మోనాలిసా గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌(Indore)కు చెందిన మోనాలిసా(Monalisa) పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవాడానికి కుంభమేళాకు వచ్చి.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే కళ్లతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఈ క్రమంలో ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేయగా ఓ రేంజ్‌లో వైరలయ్యాయి. దీంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ తరుణంలో ఆమెకు సినిమా(Movie) ఆఫర్ కూడా వచ్చింది. అయితే మోనాలిసాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ సినీ స్టార్ స్థాయికి ఎదిగిన తేనెకళ్ల సుందరీ మోనాలిసా ఇప్పుడు సినీ హీరోయిన్ గా మారిపోయి.. ఏకంగా విమాన ప్రయాణాలే కాదు.. జ్యూవెలరీ వంటి షాపింగ్ మాల్ ల ఓపెనింగ్ స్థాయికి ఎదిగిపోయింది.

రీసెంట్‌గా కేరళ(Kerala)లో ఆమె జువెల్లరీ షాపింగ్ మాల్(Jewelery Shopping Mall) ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు చేరుకున్నారు. తన లుక్ మార్చేసిన ఈ తేనె కళ్ళ చిన్నది.. అభిమానులకు అభివాదం చేసి, డాన్సులతో మరోసారి ఆకట్టుకుంది. అయితే డాన్స్‌లేసిన వీడియో(Videos)లు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె వీడియోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story