కాంగ్రెస్ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించిన మోడీ..నవ్వులే నవ్వులు

by Ajay Maddhiboyina |

ప్ర‌ధాని మోడీ బెంగుళూరు ఆర్వీ రోడ్డు-బొమ్మ‌సంద్ర మ‌ధ్య‌ మెట్రో రైలు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,

కాంగ్రెస్ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించిన మోడీ..నవ్వులే నవ్వులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీ బెంగుళూరు ఆర్వీ రోడ్డు-బొమ్మ‌సంద్ర మ‌ధ్య‌ మెట్రో రైలు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తో కలిసి ఆర్‌వీ రోడ్ నుండి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మోడీ కాంగ్రెస్ నాయ‌కుల‌తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. సంభాష‌ణ‌లో ఒక‌రితో ఒక‌రు మాట్లాడుతూ న‌వ్వుకుంటూ పూయించారు.

అంతే కాకుండా విద్యార్థులతోనూ మోడీ సరదాగా మాట్లాడారు. న‌గ‌రంలోని ఐటీ హ‌బ్‌ను అనుసంధానించే రద్దీగా ఉండే కారిడార్‌లలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఎల్లో లైన్‌ను నిర్మించారు. ఇదిలా ఉంటే ఎల్లో లైన్ ప్రారంభోత్సవానికి ముందు కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ, బీజేపీని విమర్శించారు. బీజేపీ బెంగుళూరును నిర్లక్ష్యం చేశారని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంలో మెట్రో ప్రాజెక్టుకు నిధులు త‌గ్గించ‌బ‌డ్డాయ‌ని ఆరోపించారు.

Next Story