ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో జరిగిన చర్చలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం

ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో జరిగిన చర్చలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శించిందని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో ప్రతిపక్షం సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా సమావేశంలో రాహుల్ గాంధీని ప్రస్తవిస్తూ విమర్శలు కురిపించారు. సుప్రీకోర్టు రాహుల్ గాంధీని మందలించడంపై పరోక్షంగా విమర్శించారు. ఇదిలా ఉంటే మోడీ స‌మావేశానికి హాజ‌రైన వెంట‌నే ఎన్డీఏ నాయకులు అంతా హ‌ర్ హ‌ర్ మ‌హ‌దేవ్ అనే నినాదాల‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ఇక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎన్డీఏ కూట‌మి, ఇండియా కూట‌మి మ‌ధ్య ఆప‌రేష‌న్ సిందూర్ పై వాడి వేడిగా చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో ఇండియా కూట‌మి ఎంపీలు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌గా ఎన్డీఏ నేతలు వాటికి సమాధానం చెప్పారు.

Next Story