- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mock drills: సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ వాయిదా.. కారణమిదే?
పాకిస్తాన్ సరిహద్దులోని ఆరు రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో గురువారం జరగాల్సిన మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో గురువారం జరగాల్సిన మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. రాజస్థాన్ (Rajasthan), గుజరాత్ (Gujarath), జమ్మూ కశ్మీర్ లలో విన్యాసాలు వాయిదా పడినట్టు ఆయా ప్రభుత్వాలు తెలిపాయి. పరిపాలనా కారణాల వల్ల ఈ వ్యాయామాలను పోస్ట్ పోన్ చేసినట్టు వెల్లడించాయి. మాక్ డ్రిల్స్ నిర్వహణకు త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నాయి. అలాగే పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. జూన్ 3వ తేదీన పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తామని, అందుకు గాను తమ పౌర రక్షణ సిబ్బందికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం శిక్షణ ఇస్తున్నారని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగికరించింది. మిగిలిన రాష్ట్రాలు త్వరలో కొత్త తేదీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు ఈ నెల 29న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై చర్చలు జరిపిన రాష్ట్రాలు వాయిదా వేశాయి.






