అసెంబ్లీలో ఇదేం పని! పాన్ తిని సభలో ఉమ్మేసిన ఎమ్మెల్యే.. స్పీకర్ ఆగ్రహం

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన ఉదంతం చోటుచేసుకుంది.

అసెంబ్లీలో ఇదేం పని! పాన్ తిని సభలో ఉమ్మేసిన ఎమ్మెల్యే.. స్పీకర్ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన ఉదంతం చోటుచేసుకుంది. మంగళవారం (Uttar Pradesh Assembly) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీలో పాన్ మసాలా తిని ఎమ్మెల్యే ఉమ్మి వేయడంపై స్పీకర్ సతీశ్ మహానా (Speaker Satish Mahana) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ శుభ్రం చేసే సమయంలో ప్రధాన హాల్ వద్ద కార్పెట్ మీద (pan masala) పాన్ మసాలా ఉమ్మివేయడం గుర్తులు ఆయన గమనించారు. ఈ క్రమంలోనే సిబ్బందితో శుభ్రం చేయించారు. దీంతో అందరూ ఎమ్మెల్యేలను పిలిచి, ఇంకోసారి ఎవరు అసెంబ్లీలో ఇలా చేయొద్దని స్పీకర్ క్లాస్ ఇచ్చారు.

అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీశ్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మన విధాన సభ హాలులో ఒక సభ్యుడు పాన్ మసాలా తిన్న తర్వాత ఉమ్మివేశాడని తెలిసింది. నేనే శుభ్రం చేశా. వీడియోలో ఆ ఎమ్మెల్యేను చూశాను, కానీ నేను పేరు చెప్పి అవమానించాలని అనుకోవడం లేదు. ఆ పాన్ ఉమ్మేసిన ఎమ్మెల్యే వచ్చి నన్ను స్వయంగా కలిసి వివరణ ఇవ్వాలి. లేకుంటే నేనే ఆ సభ్యుడిని పిలిపిస్తాను. ఎవరైనా ఇలా చేయడం చూస్తే, వారిని ఆపండి. రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీపై గౌరవం, విశ్వాసం ఉంచారు. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత’ అని స్పీకర్ వెల్లడించారు.

అయితే పాన్ మసాలా శుభ్రపరిచే సమయంలో తీసిన వీడియోలో కార్పెట్ మార్చడానికి సభ్యుడి నుంచి డబ్బు తీసుకోవాలని స్పీకర్ సీరియస్‌గా మాట్లాడటం వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసెంబ్లీలో ఇదేంపని సార్ అంటూ నెటిజన్లు పాన్ ఉమ్మేసిన ఎమ్మెల్యేపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Next Story