- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Missiles: ట్రంప్ బెదిరింపులు.. మిస్సైల్స్ దాడికి రెడీ అయిన ఇరాన్
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌పై బాంబు దాడులకూ వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్- అమెరికా(US-Iran) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌పై బాంబు దాడులకూ వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్- అమెరికా(US-Iran) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో, అప్రమత్తమైన టెహ్రాన్ మిస్సైల్స్ దాడికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మిస్సైల్స్ ని లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. ఎయిర్ స్ట్రయిక్స్ కోసం వీటిని వాడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ప్రత్యక్ష చర్చలు తిరస్కరించిన ఇరాన్
అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. దీనిపై ట్రంప్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ టెహ్రాన్ పై బెదిరింపులకు దిగారు ‘‘ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. అంతేకాకుండా, మరోవిడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయితే, ఇరాన్‌తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా? లేదా అనేదానిపై మాత్రం ట్రంప్ స్పష్టతనివ్వలేదు. ఇకపోతే, గతంలోనూ ట్రంప్ హయాంలో ఇరాన్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ట్రంప్ పాలన సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. కాగా.. ఈ సారి మాత్రం మరోసారి న్యూక్లియర్ డీల్ కుదుర్చుకునేందుకు ట్రంప్ అంగీకారం తెలపడం గమనార్హం.






