వెనిజులాలోని భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక

by Malleboina Mahesh |

వెనిజులాలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వెనిజులాలోని భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: వెనిజులా (Venezuela)లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ (Department of External Affairs of India) హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులు ఆ దేశానికి వెళ్లడం తాత్కాలికంగా మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సూచించింది. అత్యవసరం కాని పక్షంలో వెనిజులా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని శనివారం (జనవరి 3, 2026) విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే వెనిజులాలో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగడం తగ్గించుకోవాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విదేశీ వ్యవహారాల శాఖ కోరింది.

అలాగే కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అక్కడ చిక్కుకున్న, సహాయం కావాల్సిన భారతీయులు ఎప్పుడైనా సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇమెయిల్: [email protected], అత్యవసర ఫోన్/వాట్సాప్ నెంబర్: +58-412-9584288 భారతీయులందరూ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ప్రభుత్వం గట్టిగా విన్నవించింది. ఇదిలా ఉంటే వెనిజులాపై మెరుపు దాడి చేసిన అమెరికా సైన్యం.. ఆ దేశ అధ్యక్షుడు "నికొలస్ మదురోను బందిగా పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు.

Next Story