- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ నిర్ణయం తర్వాతే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు
మోడీ నిర్ణయం తరవాతనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఉపరాష్ట్రపతి

దిశ, వెబ్ డెస్క్: మోడీ నిర్ణయం తరవాతనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంయుక్తంగా ఎంపిక చేస్తారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట నడ్డా కొన్ని పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తారని తరవాత వారిలో ప్రధాని మోడీ ఒకరిని ఫైనల్ చేస్తారని చెప్పారు. బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే నెల 9వ తేదీలోగా అభ్యర్థి పేరును ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగవంతమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికలో ప్రధాని నిర్ణయం కీలకం అవ్వనుంది.






