MIG 21: ‘మిగ్ 21’ సేవలకు ముగింపు.. దాని స్థానంలో భర్తీ అయ్యే విమానమిదే?

by B.Srinivas |

వైమానిక దళంలో 62 ఏళ్ల పాటు సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్టు ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

MIG 21: ‘మిగ్ 21’ సేవలకు ముగింపు.. దాని స్థానంలో భర్తీ అయ్యే విమానమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళంలో 62 ఏళ్ల పాటు సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో యుద్ధ విమానానికి వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత ఆ విమాన సేవలు అధికారికంగా ముగుస్తాయి. ఈ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటి స్థానంలో దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానాలు ఎంకే1ఏతో భర్తీ చేయనున్నారు. కాగా, మిగ్ 21 జెట్‌ను తొలిసారిగా 1963లో భారత వైమానిక దళంలో చేర్చారు. ఇది భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ జెట్.

1965,1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధాలు, 1999 కార్గిల్ వార్, 2019 బాలకోట్ దాడులు, ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లలో ఈ ఫైటర్ జెట్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల కాలంలో ఈ విమానం తరచుగా ప్రమాదాలకు గురైంది. 400 కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ క్రమంలోనే వీటిని సైన్యం నుంచి తొలగించాలని కేంద్రం భావిస్తోంది. భారతదేశం 900 మిగ్-21 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వీటిలో 660 విమానాలను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసింది. ప్రస్తుతం వైమానిక దళంలో 36 మిగ్-21 యుద్ధ విమానాలుఉన్నాయి. ఇది అనేక దశాబ్దాలుగా అద్భుతమైన సేవలను అందించాయి.

Next Story