- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్లోజ్.. పాతికేళ్ల సేవలు బంద్ చేసిన టెక్ దిగ్గజం!
పాక్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్లోజ్ అయింది. పాతికేళ్లుగా సేవలందించిన ఆఫీసును ఈ టెక్ దిగ్గజం బంద్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో ఇప్పటికే కష్టాలు పడుతున్న టెక్ రంగానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్.. దాయాది దేశంలో తమ ఆఫీసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాతికేళ్లుగా పాక్‌లో సేవలందించిన మైక్రోసాఫ్ట్.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ఫోర్స్ తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లో తమ ఆఫీసును మూసివేస్తున్నామని, ఇకపై రీజనల్ హబ్స్, ఆథరైజ్డ్ రీసెల్లర్ల ద్వారా రిమోట్‌గానే పాక్ వినియోగదారులకు సేవలందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే తమ సేవలు ఉపయోగించుకుంటున్న కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తమ సేవల్లో క్వాలిటీ ఏమాత్రం తగ్గదని హామీ ఇచ్చింది.
ఐదుగురు ఉద్యోగులే..?
పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ బేస్‌లు ఏవీ లేవు. భారత్‌లో వీటిని ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్.. దాయాది దేశంలో కేవలం కంపెనీ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ కోసం మాత్రమే ఆఫీసు మెయింటైన్ చేసింది. ఇక్కడ కేవలం ఐదుగురు ఉద్యోగులే ఉన్నారు. అలాగే వీళ్లు అజూర్, ఆఫీస్ వంటి సేవలను అమ్మడంపై మాత్రమే పనిచేసేవారు. దీంతో మైక్రోసాఫ్ట్ నిర్ణయం ఆ దేశంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీ పూర్తిగా తమ ఆఫీసును మూసివేయడం ఆ దేశ టెక్ రంగంపై కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.






