- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MHA: పేద ఖైదీల బెయిల్‌కు కేంద్ర నిధులు ఉపయోగించాలి.. హోం శాఖ ఆదేశాలు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరిమానా చెల్లించలేక పోతున్న ఖైదీలకు కేంద్ర నిధుల నుంచి ఆర్థిక సాయం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పేద ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరిమానా చెల్లించలేక పోతున్న, బెయిల్ పొందలేక జైళ్లలోనే మగ్గుతున్న ఖైదీలకు కేంద్ర నిధుల నుంచి ఆర్థిక సాయం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)లకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ఓ లేఖ రాసింది. అర్హులైన ఖైదీలకు ఈ ప్రయోజనాలను అందించడానికి తగిన మొత్తాన్ని తీసుకోవాలని తెలిపింది. అర్హత కలిగిన ఖైదీలను గుర్తించాలని లేఖలో పేర్కొంది. పేద ఖైదీలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలపింది. దీనికి గాను సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA) ద్వారా నిధులు అందించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2023 మేలో సపోర్ట్ టూ పూర్ ప్రిసనర్స్ స్కీమ్ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా జరిమానా చెల్లించకపోతున్న ఖైదీలకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. అయితే అర్హులైన ఖైదీలను గుర్తించకపోవడంతో పాటు, దీనికి సంబంధించిన నిధులు ఆయా ప్రభుత్వాలు ఉపయోగించలేదు. ఈ పథకం అమలును సమీక్షించడానికి అనేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ స్కీమ్ సమర్థవంతంగా అమలు కాలేదు. ఈ క్రమంలోనే హోం మంత్రిత్వ శాఖ మరోసారి ఆర్డర్స్ జారీ చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం.. మొత్తం జైళ్లలో విచారణ ఖైదీల సంఖ్య 76 శాతంగా అంచనా వేసింది.






