- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. కూలిన మెట్రో స్టేషన్ పైకప్పు
దేశవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు భీబత్సం సృష్టిస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు భీబత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులను గమనిస్తూనే ఉన్నాం. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. కానీ సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోయి మేఘామృతంగా మారుతుంది. ఈ క్రమంలో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
ఢిల్లీ(Delhi)లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రజలకు భారత వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికలు కూడా జారీ చేసింది. తాజాగా ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. ఈదురు గాలుల కారణంగా న్యూ అశోక్ నగర్ ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పై కప్పు ధ్వంసమైంది. బలమైన గాలులతో టిన్ షెడ్ గాల్లోకి ఎగిరిపోయి, ఒక వాహనం పై పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






