Messi: కొనసాగుతున్న మెస్సి ఇండియా టూర్.. 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

by Prasad Jukanti |

భారత్ లో మెస్సీ టూర్ కొనసాగుతోంది.

Messi: కొనసాగుతున్న మెస్సి ఇండియా టూర్.. 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ (Messi India Tour) కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున మెస్సీ టీమ్ కోల్ కతా (Kolkata) ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. ఎయిర్ పోర్టు వద్ద మెస్సీ కోసం ఆయన అభిమానులు అర్జెంటీనా జెండాలతో పెద్ద సంఖ్యలో హాజరై 'మెస్సి మెస్సి' అంటు నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి మెస్సి తమ బృందంతో కలిసి కోల్ కతాలోని ఓ వైప్ స్టార్ హోటల్‍కు చేరుకున్నారు. అక్కడ ఉదయం లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని (70 Feet Messi Statu) బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ తో కలిసి మెస్సి వర్చువల్‍గా ఆవిష్కరించారు. భద్రతా కారణాల వల్ల మెస్సి అక్కడికి వెళ్లలేదు.

Next Story