పురుషుల ఖాతాల్లోకి మహిళా పథకం డబ్బులు.. తిరిగివ్వాలని కోరడంతో షాక్

by Ajay Maddhiboyina |

బీహార్‌లో పురుషులకు కొత్త సమస్య వచ్చిపడింది. మహిళా ఉపాధి పథకం డబ్బులను పొరపాటున పరుషుల ఖాతాల్లో వేయగా ఇప్పుడు ప్రభుత్వం

పురుషుల ఖాతాల్లోకి మహిళా పథకం డబ్బులు.. తిరిగివ్వాలని కోరడంతో షాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీహార్‌లో పురుషులకు కొత్త సమస్య వచ్చిపడింది. మహిళా ఉపాధి పథకం డబ్బులను పొరపాటున పరుషుల ఖాతాల్లో వేయగా ఇప్పుడు ప్రభుత్వం తిరిగిచ్చేయాలని ఆదేశించడంతో లబోదిబోమంటున్నారు. ఇటీవల బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ముందు నితీశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం కింద సుమారు 75లక్షల మందికి నేరుగా ఖాతాల్లోకి రూ.1వేలు జమ చేసింది. అయితే సాంకేతిక లోపం కారణంగా హిళల ఖాతాల్లోకి కాకుండా పురుషుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ అయ్యాయి.

దీంతో ఎన్నికల తరవాత ఆ డబ్బులు తిరిగి పంపాలని అధికారులు అడుగుతున్నారు. దీంతో పురుషులు ఆ డబ్బు ఖర్చు చేశామని ఇప్పుడు ఇవ్వమంటే ఎక్కడ నుండి తిరిగిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి తాను దివ్యాంగుడిని అని ప్రభుత్వమే తనకు డబ్బులిచ్చింది అనుకుని ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఇప్పుడు నోటీసు అందిందని ఎక్కడ నుండి తిరిగివ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వ్యక్తి వచ్చిన డబ్బుతో మేకలు, బాతులు కొనుగులో చేశానని చెేప్పాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

Next Story