- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Australia Floods : ఆస్ట్రేలియాలో భారీ వరదలు.. చిక్కుకున్న 50 వేల మంది భారతీయులు
ఆస్ట్రేలియాలో భారీ వరదలు(Austrelia Floods) సంభవించి దాదాపు 50 వేల మంది భారతీయులు ఆ వరదల్లో చిక్కుకుపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలో భారీ వరదలు(Australia Floods) సంభవించి దాదాపు 50 వేల మంది భారతీయులు ఆ వరదల్లో చిక్కుకుపోయారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్(NSW) రాష్ట్రంలో గత రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా నలుగురు మరణించగా.., ఐదుగురు గల్లంతయినట్టు సమాచారం. అయితే భారతీయులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భారీ వరదలు సంభవించగా.. 50,000 మంది వరకు ఇండియన్స్ వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. NSWలోని మిడ్ నార్త్ కోస్ట్, పోర్ట్ మాక్వేరీ, టినోనీ, టారీ ప్రాంతాల్లో నాలుగు నెలల వర్షం రెండు రోజుల్లోనే కురిసింది. కొన్ని చోట్ల 300 మి.మీ వర్షపాతం నమోదై, ఆకస్మిక వరదలకు దారితీసింది. హంటర్ వ్యాలీ, సెంట్రల్ కోస్ట్‌లో నదులు ఉప్పొంగి రోడ్లు, ఇళ్లు, వ్యవసాయ భూములు మునిగిపోయాయి.
వరదల్లో చిక్కుకున్న వారిలో 20,000 మంది ఒకే ప్రాంతంలో చిక్కుకున్నారని.. వీరికోసం 100-150 రెస్క్యూ బృందాలు ఆపరేషన్లు చేపట్టాయి. ఆస్ట్రేలియా చుట్టూ సముద్రాలు వేడెక్కడం వల్ల ఈ తీవ్ర వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. NSW లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్(Australian PM Anthony Albanese) వరద బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.






