Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-30 05:55:05  IST  )

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో (Kolkata) మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. సెంట్రల్ కోల్‌కతాలో ఉన్న రితురాజ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు భవనం కిటికీలు, ఇరుకైన గోడల నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించారు. నాలుగో అంతస్తు నుంచి పలువురు కిందకు దూకగా గాయపడ్డారు. ఈ ఘటనలో 14 మంది మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశారు. చాలామందిని రక్షించారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జీ కర్, నీల్ రతన్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పది ఫైర్‌ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ ప్రాంతం రద్దీగా ఉండడంతో ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. అలాగే, మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. బుర్రాబజార్ తూర్పు భారతంలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుంది. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.


Click For Tweet..

Next Story