రూ.23 కోట్ల విలువైన గంజాయి సీజ్.. నోరెళ్లబెట్టిన కస్టమ్స్ అధికారులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-06 09:56:41  IST  )

తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

రూ.23 కోట్ల విలువైన గంజాయి సీజ్.. నోరెళ్లబెట్టిన కస్టమ్స్ అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌(Chennai Airport)లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.25 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు(Customs Department) అంచనాకు వచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ కస్టమ్స్‌ విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. చెన్నై ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. వారి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా ప్యాక్‌ చేసి తీసుకొచ్చిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి చెన్నైకి మాదకద్రవ్యాలను రవాణా చేస్తే నగదు చెల్లిస్తామని చెప్పడంతోనే తాము ఈ పని చేసినట్లు నిందితులు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story