- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఝార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
ఝార్ఖండ్‌లో భద్రతా దళాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మృతి (Maoist Encounter) చెందాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్‌లో భద్రతా దళాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మృతి (Maoist Encounter) చెందాడు. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని గోయిల్ కేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారండా అడవి (Saranda forest)లో ఈ ఎన్ కౌంటర్ (chaibasa encounter) జరిగినట్లు భద్రతా దళాలు అమిత్ హస్దా అలియాస్ ఆప్తాన్ ను మట్టుబెట్టాయని పోలీస్ సూపరింటెండెంట్ పరాస్ రాణా తెలిపారు. మరణించిన మావోయిస్టుపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు.
ఝార్ఖండ్ లోని పలము జిల్లాలో నిషేధిత తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ (TSPC)కి చెందిన మావోయిస్టులతో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన కొద్దిరోజులకే ఈ ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది ఇతర మావోయిస్టుల స్థావరాలను గుర్తించేందుకు అటవీప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.






