- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాలు.. షాకింగ్ ఘటన ఎక్కడ వెలుగు చూసిందంటే..?
ఒక లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాలు తయారు చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో : ఒక లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాలు తయారు చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన యూపీ బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. అజయ్ అగర్వాల్ అనే వ్యాపారి స్థానికంగా అగర్వాల్ ట్రేడర్స్ పేరిట వ్యాపారం చేస్తున్నాడు. సింథటిక్ మిల్క్, పన్నీర్‌ను గత 20 ఏళ్లుగా విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అసలైన పాల రుచి వచ్చేలా నిందితుడు కృత్రిమ తీపి పదార్థాలను, ఫ్లేవర్లను వినియోగించినట్లు తేలింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రైడ్స్ చేసి నిందితుడి నాలుగు గోడౌల నుంచి భారీగా కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ కృత్రిమ పాల తయారీకి వాడిన కెమికల్స్ ఏమిటనేది వెల్లడించలేదని అధికారులు తెలిపారు. కానీ ఐదు మిల్లీ లీటర్ల కెమికల్‌తో రెండు లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసే వాడని తెలిపారు. స్వచ్ఛమైన పాల టెస్ట్ వచ్చేందుకు గాను నిందితుడు కొంత మంది ఫ్లేవరింగ్ ఏజెంట్లను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో వీరు తయారు చేసిన సింథటిక్ మిల్క్ స్వచ్ఛమైన పాల రుచి, వాసన వచ్చేవని వెల్లడించారు.






