- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. దేశం పరువు తీశారుగా..!
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడో దుండగుడు. అతన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సౌతాఫ్రికాతో మహిళల వరల్డ్ కప్ పోరు కోసం ఇండోర్ వచ్చిన ఆస్ట్రేలియా టీంకు చేదు అనుభవం ఎదురైంది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ప్లేయర్లు తమ హోటల్ నుంచి దగ్గరలోని కేఫ్‌కు వెళ్తుండగా.. ఒక దుండగుడు వాళ్లను అనుసరించాడు. బైక్‌పై వారిని వెంబడించి, అనంతరం వారిని అసభ్యంగా ముట్టుకొని పరారయ్యాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ప్లేయర్లు ఏడుస్తూ తమ డిఫెన్స్ టీంను కాంటాక్ట్ చేశారు. వారిని వెంటనే తిరిగి హోటల్‌కు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి బైక్ నెంబర్ ఒక స్థానికుడు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు చెక్ చేసిన పోలీసులు.. నిందితుడిని అకీల్ ఖాన్‌గా గుర్తించారు. అతనిపై గతంలో కూడా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దుర్భరంగా మారిందని, ప్రభుత్వం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. అలసత్వంతో దేశం పరువు తీస్తున్నారంటూ ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి.






