- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mamata Banerjee: పార్టీ నాయకత్వమే ఆ నిర్ణయం తీసుకుంటుంది.. టీఎంసీ వారసులపై దీదీ ప్రకటన
తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో(TMC) విబేధాలు ఏర్పడ్డాయి. సీనియర్లు, యువ నేతల మధ్య పోరు నడుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో(TMC) విబేధాలు ఏర్పడ్డాయి. సీనియర్లు, యువ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తన వారసులు ఎవరనే దానిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం కలిసికట్టుగా తన వారసులపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తమ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయన్ని తెలిపారు. తమ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. తానేమీ పార్టీ కాదని.. కార్యకర్తలం అందరం కలిస్తేనే పార్టీ అని అన్నారు. తమదో కుటుంబం అని.. నిర్ణయాలను కలిసికట్టుగానే తీసుకుంటామన్నారు.
సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు
టీఎంసీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఇక్కడ ఏ ఒక్కరూ ఆదేశాలు ఇవ్వరని దీదీ అన్నారు. ప్రజలకు ఏది మంచిదో అది పార్టీ నిర్ణయిస్తుందని, తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నారని, కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలపైనా దీదీ స్పందించారు. పార్టీకి ప్రతి ఒక్కరూ ముఖ్యమే అని, ఇవాళ కొత్తగా వచ్చిన వారు రేపు సీనియర్ అవుతారన్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు మమతా బెనర్జీతో సత్సంబంధాలు ఉన్నాయి. కాగా.. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీకి యువ నాయకులు దగ్గరగా ఉన్నారు. ఆ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.






