Lakshadweep : గూగుల్ ట్రెండింగ్ లో లక్షద్వీప్.. 20 ఏళ్ల రికార్డు బ్రేక్..!

by Dishanational6 |
Lakshadweep : గూగుల్ ట్రెండింగ్ లో లక్షద్వీప్.. 20 ఏళ్ల రికార్డు బ్రేక్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ పర్యటన తర్వాత లక్షద్వీప్ గూగుల్ లో ట్రెండింగ్ కీవర్డ్ గా మారింది. లక్షద్వీప్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే ఏకంగా 20 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం. మరోవైపు తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్‌ కోసం వెతుకుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని ప్రకటించింది ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ .

మేక్ మై ట్రిప్ ప్రకటన

లక్షద్వీప్‌లో మోడీ పర్యటన తర్వాత.. ఆ దీవుల కోసం వెతికే వారి సంఖ్య 3,400 శాతం పెరిగిందని తెలిపింది మేక్ మై ట్రిప్. బీచ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న ట్రావెలర్స్ కోసం.. కొత్త కార్యక్రమం చేపట్టేందుకు స్పూర్తినిచ్చిందంది. బీచెస్ ఆఫ్ ఇండియా పేరుతో అద్భుతమైన బీచ్ లు చూసేలా.. కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తామని ట్విట్టర్ లో తెలిపింది మేక్ మై ట్రిప్. మరోవైపు మేక్ మై ట్రిప్ లో మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

20 ఏళ్ల రికార్డు బ్రేక్

ప్రధాని మోడీ లక్షద్వీప్ లో పర్యటించాక.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో లక్షద్వీప్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈనెల 5న ఒక్కరోజే 50 వేల మంది గూగుల్ లో లక్షద్వీప్ కోసం వెతినట్లు సమాచారం. భారత్ లోని దీవుల కోసం ఆన్ లైన్ లో వెతికే వారి సంఖ్య 20 ఏళ్లలో ఇదే రికార్డు అని MyGovIndia, ఆల్‌ఇండియా రేడియో, డీడీ న్యూస్‌లు స్పష్టం చేశాయి.


Next Story

Most Viewed