- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MahaYuti : కేబినెట్ విస్తరణ టగ్ అఫ్ వార్.. కీలక శాఖలపై ‘మహాయుతి’ కసరత్తు
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరి దృష్టి కేబినెట్ విస్తరణపై పడింది.

దిశ, నేషనల్‌బ్యూరో : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరి దృష్టి కేబినెట్ విస్తరణపై పడింది. అయితే డజన్‌కు కీలక శాఖల కేటాయింపు మహాయుతి కూటమికి టగ్ అఫ్ వార్‌గా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోగా కేబినెట్ కూర్పు పూర్తి చేయాలని కూటమి నాయకత్వం భావిస్తోంది. మహాయుతి కూటమి ముఖ్య నేతలు ఈ వారం చివరిలోగా కేబినెట్ విస్తరణపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సెషన్ డిసెంబర్ 16 నంచి 21 వరకు కొనసాగనుంది. ఈ లోగా కొత్త మంత్రి వర్గం కొలువుదీరేలా సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, పవార్‌లు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ 11 లేదా 12న కేబినెట్ విస్తరణ చేపట్టాలని కూటమి భావిస్తున్నట్లు తెలిసింది. సీఎం పదవి కేవలం టెక్నికల్ ఒప్పందం మాత్రమే. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఫడ్నవీస్ వ్యాఖ్యనించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసినట్లు ఆయన తెలిపారు.
మంత్రుల కేటాయింపు ఫార్ములా ఇదే..!
288 సభ్యులు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 43 మంది మంత్రులను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇది శాసనసభ్యుల మొత్తం సంఖ్యలో 15 శాతం కానుంది. కేబినెట్‌లో బీజేపీకి 21, శివసేనకు 12, ఎన్సీపీకి 10 చొప్పున మంత్రులను నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ హై కమాండ్ మంత్రుల లిస్టును సిద్ధం చేసినట్లు తెలిసింది. షిండేకు అర్బన్ డెవలప్‌మెంట్, రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు తెలిసింది. పవార్‌కు ఆర్థిక శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ హోం శాఖను వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది.






