- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maharashtra: ‘లవ్ జిహాద్’ను అడ్డుకునేందుకు మహా సర్కార్ నిర్ణయం
‘లవ్ జిహాద్’ను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు అడ్డుకోవడానికి ఏడుగురు సభ్యులతో కమిటీని వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ‘లవ్ జిహాద్’ను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు అడ్డుకోవడానికి ఏడుగురు సభ్యులతో కమిటీని వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, ఈ తరహా ఘటనలను అడ్డుకొనేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి తెలియజేయనుంది. ‘లవ్ జిహాద్’ ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను కమిటీ సూచిస్తుంది. అంతేకాకుండా అలాంటి చర్యలు నిరోధించేందుకు చట్టాన్ని సిఫార్సు చేసేందుకు ఇతర రాష్ట్రాల చట్టాలను అధ్యనం చేస్తుందని మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. కాగా.. ఈ కమిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా ధన్యవాదాలు తెలిపారు. "లవ్ జిహాద్" సంఘటనలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తు చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు
అయితే, మహా సర్కారు ఇలాంటి కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత వ్యవహారాలని పేర్కొన్నారు. వ్యక్తిగత వివరాలపై కాకుండా ఆర్థిక సమస్యలపై దృష్టిసారించాలని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కులుగా చేసి హత్య చేశాడు. దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో దీనిపై తీవ్రంగా చర్చ జరిగడంతో.. ఈ అంశంపై అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ సర్కారు ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.






