- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థాక్రేలకే కాదు పవార్‍లకూ పంచ్ ఇచ్చారు.. మహారాష్ట్ర పురపోరు తీర్పు పార్టీలకు ఓ గుణపాఠమా?
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో మున్సిపల్ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. తాజా వివరాల ప్రకారం మెజార్టీ కార్పొరేషన్లలో బీజేపీ దూసుకుపోతోంది. మిగతా కార్పొరేషన్లతో పోలిస్తే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో విజయంకోసం ఏకమైన థాక్రే బ్రదర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 227 వార్డులు ఉంటే ఇప్పడి వరకు బీజేపీ 88, శివసేన 31 స్థానాల్లో ఆధిక్యంతో ఉన్నాయి. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి 63, రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ్ నిర్మాణఅ సేన (ఎంఎన్ఎస్) 6 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా ఇక్కడ కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితం అయింది. ఇక పుణే, పింప్రీ-చించ్ వడ్ మున్సిపల్ కార్పొరేషన్లలో శరద్ పవార్, అజిత్ పావార్ పార్టీలు కలిసి పనిచేసినా ఓటర్లు వీరిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పుణెలో 165 వార్డలు ఉండగా బీజేపీ 50కి పైగా స్థానాలాలో ముందు వరుసగా ఉండగా ఎన్సీపీ ఐదు, ఎన్సీపీ (శరద్ పవార్)2 స్థానాలకు పరిమితం అయింది. ఇక పింప్రి చించ్ వడ్ కార్పొరేషన్లో 127 వార్డులకు గాను బీజేపీ 70 చోట్ల లీడ్ లో ఉండగా ఎన్సీపీ 39, ఎన్సీపీ (శరద్ పవార్) 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
పార్టీలకు ఓ గుణపాఠమా?:
పేరుకు ఈ ఎన్నికలు మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం పక్క రాష్ట్రాలకు సైతం పాకింది. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడుతున్న ఫలితాలు అవసరాల కోసం దారులు తొక్కే రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠమా అనే చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు నువ్వా నేనా అంటూ కయ్యానికి కాలు దువ్విన రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ చేతులు కలిపాయి. మళ్లీ కలవనే కలవరని భావించిన థాక్రే సోదరులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసిపోయారు. రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి విడిపోయిన పవర్ ఫ్యామిలీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కలిసిపోయింది. కానీ ఫలితాలు రాబట్టుకోవడంలో మాత్రం ఈ రెండు కుటుంబాలు తేలిపోయాయి. ప్రస్తుతం ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా తుది ఫలితాల సమయానికి ఏం జరగబోతోంది? మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది ఆసక్తిగా మారింది.






