Mid Day Meal: ఇకపై మధ్యాహ్న భోజనంలో ‘ఎగ్’ కట్..! సర్కార్ సంచలన నిర్ణయం

by Ramesh Naini |   (  Updated:2025-02-04 12:27:57  IST  )

పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వాలు మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Mid Day Meal: ఇకపై మధ్యాహ్న భోజనంలో ‘ఎగ్’ కట్..! సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వాలు (mid-day meal scheme) మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. పౌష్టికాహారం అందించడం, పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లడం మానివేయకూడదనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్ర‌లో ఇటీవల ఏర్పడిన కొత్త (Maharashtra) ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంపై సంచలన నిర్ణయం తీసుకుంది.

పాఠశాల విద్యా శాఖ మధ్యాహ్న భోజనంలో అందించే వంటకాల జాబితాను మహారాష్ట్ర‌ ప్రభుత్వం సవరించింది. అందులో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగానే 1 నుంచి 8 తరగతుల మధ్యాహ్న భోజన మెనూ నుంచి గుడ్లు, చక్కెరను తొలగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి బదులుగా ‘గుడ్డు పులావ్’ రాగి జావ లాంటి వంటకాన్ని అందించాలని ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశించింది. అయితే, పౌష్టికాహారం అయిన గుడ్డును తొలగించడం పట్ల ప్రతి పక్ష నేతలు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సైతం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. గుడ్డును తొలగించడంపై ఎన్డీయే ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


Click Here Tweet..

Next Story