Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేను హత్య చేస్తామంటూ ఈమెయిల్ బెదిరింపు

by S Gopi |

గురువారం గుర్తుతెలియని ఈమెయిల్ నుంచి ఏక్‌నాథ్ షిండె కారును పేల్చివేస్తామని మెసేజ్ వచ్చింది.

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేను హత్య చేస్తామంటూ ఈమెయిల్ బెదిరింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. గురువారం గుర్తుతెలియని ఈమెయిల్ నుంచి ఏక్‌నాథ్ షిండె కారును పేల్చివేస్తామని మెసేజ్ వచ్చింది. మంత్రాలయ (రాష్ట్ర సచివాలయం)తో పాటు గోరేగావ్, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లకు ఈ బెదిరింపు మెసేజ్‌లు రావడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ముంబై పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ పంపిన వ్యక్తి ఐపీ అడ్రస్‌ను కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెళ్లారు. అయినప్పటికీ బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని ఏక్‌నాథ్ షిండే చుట్టూ భద్రతను పెంచారు. ప్రాథమిక దర్యాప్తులో అదొక బూటకపు మెయిల్‌గా తేల్చారు. అయితే, ఏక్‌నాథ్ షిండెకు ఇలాంటి బెదిరుంపులు రావడం మొదటిసారి కాదు. ఇదివరకు 2024, ఫిబ్రవరిలో ఓ కాలేజీ స్టూడెంట్ ఏకనాథ్ షిండే, ఆయన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేలను చంపేస్తానని బెదిరించాడు. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనపై థానెలోని శ్రీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story