- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahakumb: మహాకుంభ మేళా.. 27 కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు
మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 27.58 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumba mela)లో తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22 వెలుపల చమన్‌గంజ్ చౌకీ సమీపంలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 గుడారాలు కాలిపోయాయి. ప్రమాద సమయంలో భయందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సత్వరమే స్పందించి మంటలను ఆర్పడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి ప్రమోద్ శర్మ (Pramod sharma) తెలిపారు. కాగా, మౌని అమావాస్య సందర్భంగా బుధవారం జాతరలో తొక్కిసలాట జరగగా ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. అంతకుమందు ఈనెల 19న శాస్త్రి బ్రిడ్జి సమీపంలోని సెక్టార్ 19లోని గీతా ప్రెస్ క్యాంపులో మంటలు చెలరేగగా గీతా ప్రెస్‌లోని 180 కాటేజీలు కాలిపోయాయి.
కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 27.58 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 1.52 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు తెలిపింది. ఫిబ్రవరి 3వ తేదీన బసంత్ పంచమి సందర్భంగా సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.






