- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbhmela: కుంభమేళాకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ప్రయాగ్‌రాజ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్
మౌని అమావాస్య (Mouni Amavasya) పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళా (Kumbhmela)లో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

దిశ, వెబ్‌డెెస్క్: మౌని అమావాస్య (Mouni Amavasya) పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళా (Kumbhmela)లో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రహాదారులన్ని వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే కుంభమేళా రద్దీని దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చేంత వరకు బీహార్ రాష్ట్రం (Bihar State) నుంచి భారీ వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా నిషేధించింది. కుంభమేళా (Kumbhmela)లో ఊహించిన రద్దీని చక్కదిద్దేందుకు పోలీసులు తమమునకలు అవుతున్నారు.
ముఖ్యంగా గయా (Gaya), ఔరంగాబాద్ (Aurangabad), రోహ్తాస్ కైమూర్ (Rohtas Kaimur) జిల్లాల్లో ఎన్‌హెచ్-19 (National Highway-19) వెంట దాదాపు 15 వేలకు పైగా భారీ వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. కైమూర్ ఎస్పీ హరి మోహన్ శుక్లా (Kaimur SP Hari Mohan Shukla) మాట్లాడుతూ.. కేవలం కార్లు ఇతర తేలికపాటి మోటారు వాహనాలు, అంబులెన్స్‌లు మాత్రమే ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని వెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ పరిణామంతో ఎన్‌హెచ్-19 (NH-19), ఎన్ హెచ్-౩౩౦ (NH-330) రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
సోమవారం రాత్రి నుంచి ప్రయాగ్ రాజ్ (Prayagraj) నుంచి దాదాపు 47 కిలో మిటర్ల దూరంలో వేలాది వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలపొద్దని వచ్చే భక్తులకు పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే.. అత్యవసర సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు రోడ్లను క్లియర్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ అవ్వడంతో గత 16 గంటలుగా రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిండి, తాగేందుకు కనీసం మంచి నీరు లేక అల్లాడుతున్నారు. కుంభమేళాలో పుణ్యం స్నానం చేసేందుకు వస్తే ప్రభుత్వం కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని యూపీ ప్రభుత్వంపై పలు రాష్ట్రాల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.






