- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మ్యాజిక్ పుట్టగొడుగులు' మాదక ద్రవ్యాలు కావు
ఇలాంటి కేసుల్లోనే కర్ణాటక, తమిళనాడు హైకోర్టుల్లో గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ కేరళ హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది.

- స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో:
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్ట ప్రకారం మ్యాజిక్ మష్రూమ్‌లను నిషేధిత మాదక ద్రవ్యాలుగా వర్గీకరించలేమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. పుట్టగొడుగులు సహజంగా వచ్చే ఫంగస్ అని కోర్టు పేర్కొంది. డ్రగ్స్‌కు సంబంధించిన నేరానికి సంబంధించి 90 రోజులుగా జైలులో ఉన్న కర్ణాటక వ్యక్తి కేసును వాదిస్తూ జస్టిస్ జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కేసుల్లోనే కర్ణాటక, తమిళనాడు హైకోర్టుల్లో గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ కేరళ హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది. కాగా, నిందితుడు నిరుడు 2024 అక్టోబర్‌లో అరెస్టు చేసిన సమయంలో 226 గ్రాములు మ్యాజిక్ మష్రూమ్‌లు, 50గ్రాములు మ్యాజిక్ మష్రూమ్ క్యాప్సుల్స్‌తో పాటు తక్కువ మొత్తంలో చరత్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే మ్యాజిక్ మష్రూమ్ బరువును చరస్, గంజాయితో కలిపి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పదార్థాలనన్నింటినీ సమిష్టిగా ఎలా కొలుస్తారని డిఫెన్స్ వాదించింది. ఈ వాదనల ఆధారంగా, ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం మ్యాజిక్ మష్రూమ్‌లు నిషేధిత పదార్థాల కేటగిరీలోకి రావని హైకోర్టు గమనించి, నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.






